Kumar!!!!!!!
Monday, September 17, 2012
Friday, June 29, 2012
Monday, February 6, 2012
Queen
|
| Reactions: |
Saturday, February 4, 2012
Want to be successful as a leader?
do you want to be successful as a leader, follow below things
Form a group which is very very competent. Are you the decision maker, recruit the best. Going for non eligible candidates will simply be wasting your time
| Reactions: |
Saturday, December 31, 2011
Things to follow in life
Competencey
Listen
Read
Analyse
Think
Standards - best solution?
Organize - Plan
Quality
Now
| Reactions: |
Saturday, November 12, 2011
Kids Plans

కిడ్డీ ప్లాన్స్
పిల్లలు పుట్టినప్పటినుంచే వారి భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచన చేసే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరుగుతోంది. మరికొంతమందైతే పెళ్లయిన దగ్గరినుంచి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకుంటున్నారు. అత్యధికంగా 63 శాతం మంది తల్లిదండ్రులు... పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరు మీద మదుపును ప్రారంభిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువమంది, పిల్లలకు మూడేళ్లురాగానే మదుపు ప్రారంభిస్తుంటే 20 శాతం మంది ఏడేళ్ళలోపు, 9 శాతం మంది పిల్లలు పుట్టకుండానే వారి కోసం పొదుపు చేస్తున్నారట. రేపు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల పేరు మీద ఉన్న ప్రత్యేక పథకాల సమాహారమే ఈ వారం ఫ్రాఫిట్ ముఖ్య కథనం
బీమా
అటు బీమా రక్షణ, ఇటు పన్ను ప్రయోజనాలు, ఇంకోపక్క ఇన్వెస్ట్‌మెంట్ ఇలా అన్ని ప్రయోజనాలు కలిసి ఉండటంతో పిల్లల కోసం పొదుపు అనగానే ఎవరికైనా బీమా పథకాలే గుర్తుకు వస్తాయి. వీటికి బాగా డిమాండ్ ఉండటంతో బీమా కంపెనీలు వివిధ రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా 64 శాతం మంది బీమా పథకాలవైపే మొగ్గు చూపుతున్నట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది. బీమా పథకాలను మూడు రకాలుగా అంటే... ఎండోమెంట్ పాలసీ, మనీ బ్యాక్, యులిప్స్‌గా విభజించవచ్చు. చిల్డ్రన్ పాలసీల్లో మనీ బ్యాక్ పాలసీలే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో సొమ్మును ఒకేసారిగా కాకుండా సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున వెనక్కి ఇస్తుంటాయి.
ఈ పాలసీలు పిల్లలకి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి .. అంటే ఇంటర్మీడియెట్ విద్య పూర్తి అయ్యేసరికి డబ్బు చేతికి అందే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఎల్‌ఐసీకి చెందిన కోమల్ జీవన్, జీవన్ కిషోర్, జీవన్ అనురాగ్, చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్ వంటి పథకాలు ఈ కోవకు చెందినవే. ఇక ఎండోమెంట్ పాలసీలు ...అంటే మొత్తం సొమ్ము ఒకేసారి చేతికి అందుతుంది. ఉన్నత చదువులు, పెళ్ళిళ్ళకు ఒకేసారి పెద్ద మొత్తం కావాలనుకునే వారికోసం ఈ పాలసీలను రూపొందించారు. ఈ విభాగంలో ఎల్‌ఐసీ.. జీవన్ ఛాయ, మ్యారేజ్ ఎండోమెంట్, ఎండోమెంట్ 18, ఎండోమెంట్ 21 పేరుతో పాలసీలను అందిస్తోంది.
యులిప్స్ విషయానికి వస్తే... మిగిలిన రెండింటితో పోలిస్తే వీటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి సేకరించిన సొమ్మును ఈక్విటీలు, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మీకు అందిస్తారు. యులిప్స్ నిధులను స్టాక్‌మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ మేరకు కొంత రిస్క్ ఉంటుంది. కనుక, కొద్దిగా రిస్క్ చేయగలిగినవారికి ఇవి అనువైనవి. అయిదు సంవత్సరాల లాకిన్ పీరియడ్ అయిన తర్వాత నగదు అవసరమైనప్పుడు కొంత మొత్తం తీసుకునే వెసులుబాటునూ యులిప్స్ కల్పిస్తాయి. ఎల్‌ఐసీ ఫార్చ్యూన్ ప్లస్ ఈ కోవకు చెందినదే.
ఇప్పుడు దాదాపు అన్ని బీమా కంపెనీలు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా అధిక ప్రయోజనాన్ని కల్పించే రైడర్లను అందిస్తున్నాయి. చిల్డ్రన్ పాలసీలు తీసుకునే వారు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు. దీని వలన తల్లిదండ్రులకు అనుకోని సంఘటన జరిగినా పాలసీ రద్దు కాదు. తదుపరి ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది.
మ్యూచువల్ ఫండ్స్
ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా చిల్డ్రన్ ఫండ్స్‌పై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. మార్కెట్లో దాదాపు పదికిపైగా చిల్డ్రన్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక లక్ష్యంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అధిక రిస్క్ చేయకుండా ఈక్విటీలు, డెట్ పథకాల్లో బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుబడి చేస్తాయి. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలతో పోలిస్తే వీటిల్లో కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటుంది. కొద్దిగా రిస్క్ చేసేవారికి ఈక్విటీ ఓరియంటెడ్ చిల్డ్రన్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. గత మూడేళ్ళలో ఈ విభాగం సగటున 20 శాతం రాబడిని అందించింది. టెంపుల్టన్ ఇండియా క్యాప్ గిఫ్ట్‌ప్లాన్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్ గిఫ్ట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్-గిఫ్ట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్-అడ్వాంటేజ్ వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. అదే డెట్ ఓరియంటెడ్ చైల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే గడచిన మూడేళ్ళలో ఈ పథకాలు 9-10 శాతం వార్షిక రాబడిని అందించాయి. టాటా యంగ్ సిటిజన్స్, ఎల్‌ఐసీ చిల్డ్రన్, మాగ్నం చిల్డ్రన్ బెనిఫిట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్ బ్యాలెన్స్‌డ్ వంటి పథకాలున్నాయి.
స్థిరాదాయం
బీమా పథకాల తర్వాత పిల్లల పేరుమీద ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్న వాటిల్లో బ్యాంకు డిపాజిట్లు పోస్టాఫీసు పథకాలు ఉన్నాయి. బ్యాంకులు అయిదు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై ఇప్పుడు 8-9 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. స్వల్పకాలిక అవసరాల కోసం అయిదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు కిసాన్ వికాసపత్రాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటివి కూడా పిల్లల పేరుపైన ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు కిసాన్ వికాసపత్రాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఇంకా అమలులోకి రాలేదు.
కిడ్స్ అకౌంట్స్
చిన్న పిల్లల్లో పొదుపు పట్ల అవగాహన, ఆర్థిక క్రమశిక్షణను పెంచడానికి పలు బ్యాంకులు కిడ్డీ బ్యాంక్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఆంధ్రాబ్యాంక్ కిడ్డీ బ్యాంక్ పేరుతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పిల్లలకోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐఎన్‌జీ వైశ్యా వంటి ప్రైవేటు బ్యాంకులు కూడా పిల్లల కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచాయి. ఈ అకౌంట్స్ అన్నింటికీ తల్లిదండ్రులు లేదా సమీప బంధువులు ఎవరైనా గార్డియన్‌గా ఉండాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్‌తో ఖాతా నిర్వహణ, డెబిట్ కార్డు, చెక్‌బుక్ వంటి ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.
| Reactions: |
Saturday, September 10, 2011
House Loan
దేనికీ ఫిక్స్ కావద్దు
రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుముఖం పట్టినా పెరుగుతున్న వడ్డీరేట్లు గృహ రుణాలు తీసుకునే వారిని వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. గత ఏడాదిన్నరలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను ఏకంగా 11 సార్లు పెంచింది. దీంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్‌డ్ రేట్ల పేరుతో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. తొలుత ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ రేట్ల పోటీకి తెరలేపగా హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు అదే బాటను అనుసరించాయి. ప్రస్తుతస్థాయి నుంచి వడ్డీరేట్లు ఇంకా పెరిగే అవకాశముందా? ఫిక్స్‌డ్ వడ్డీరేట్లను ఎంచుకోవడం వల్ల ప్రయోజనాలేమైనా ఉన్నాయా అన్న అంశాలపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ.
నిన్నటివరకు గృహరుణాల్లో ఫ్లోటింగ్ రేట్లకే పరిమితమైన బ్యాంకులు ఇప్పుడు తిరిగి ఫిక్స్‌డ్ రేట్లవైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా వచ్చే పండుగల సీజన్‌లో కొత్త కస్టమర్లకు ఆకర్షణీయమైన రేట్లతో నిర్దిష్ట కాలపరిమితికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. సహజంగా ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు ఫ్లోటింగ్ రేట్ల కంటే ఒకటి నుంచి రెండు శాతం అధికంగా ఉంటాయి. కాని ఈసారి ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు ఫ్లోటింగ్ రేట్లకు దాదాపు సమానంగా లేక స్వల్పంగా ఎగువ స్థాయిలో ఉంటున్నాయి. వడ్డీరేట్లు ఇంకా పెరిగే అవకాశముందన్న ఆందోళన నేపథ్యంలో ఖాతాదారులు ఫిక్స్‌డ్ కాలపరిమితిగల రుణాలవైపు మొగ్గు చూపవచ్చన్నది బ్యాంకుల అంచనా. కాని నిర్ణయాలు తీసుకోవడంలో అన్ని అవకాశాలనూ సాకల్యంగా పరిశీలించాలని ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ నిపుణులు సూచిస్తున్నారు.
వడ్డీరేట్లు కనిష్టస్థాయిలో ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ రేటుకు బ్యాంకులు గృహరుణాలు ఇవ్వవనీ, వడ్డీ రేట్లు గరిష్టస్థాయికి చేరుకున్నాయన్న సంకేతాలు వచ్చినప్పుడు మాత్రమే బ్యాంకులు ఈ విధంగా ఫిక్స్‌డ్ రేట్లపై రుణాలను అందిస్తాయన్న ఒక అభిప్రాయం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ వడ్డీరేట్లు తగ్గినా అధికరేటుపైనే కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే జూన్ క్వార్టర్లో దేశ వృద్ధి రేటు ఎనిమిది శాతం దిగువకు చేరుకోవడంతో పాలసీ రేట్లను రిజర్వు బ్యాంకు మరింతగా పెంచే సాహసం చేయకపోవచ్చని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, రైట్‌హొరెజైన్స్ సీఈవో అనిల్ రెగో తెలిపారు. ఇదేరకమైన సంకేతాలు ఆర్‌బీఐ నుంచి కూడా వస్తున్నాయి. ప్రస్తుతస్థాయి నుంచి మరో పావు శాతం మించి వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణుడు తుమ్మల కిషోర్ అభిప్రాయపడ్డారు.
వడ్డీరేట్లలో ఒడిదుడుకులు
గత పదేళ్లుగా వడ్డీరేట్లలో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. 2001లో గృహ రుణాలు గరిష్ట స్థాయిలో 14 శాతం(ఫ్లోటింగ్) చేరుకోగా అవి 2003 నాటికి కనిష్టస్థాయి 7 శాతానికి దిగివచ్చాయి. తిరిగి వేగంగా పెరుగుతూ 2007 చివరినాటికి 10.5-11 శాతానికి చేరాయి. అక్కడ నుంచి మళ్లీ అంతే వేగంగా పతనమవుతూ 2008 చివరినాటికి 8 శాతానికి పతనమయ్యాయి. అక్కడ నుంచి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు తిరిగి 10.5-11 శాతానికి చేరాయి. అంటే 2007 చివరి నాటి గరిష్టస్థాయికి వడ్డీరేట్లు చేరుకున్నాయి. ఈ స్థాయి నుంచి తక్షణం తగ్గే అవకాశాలు లేవు. అంతేకాదు... ఇంతకంటే వేగంగా పెరిగే అవకాశాలూ లేవన్నది నిపుణుల భావన. ఇప్పటికీ ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉండటంతో వడ్డీరేట్లు గరిష్టస్థాయిలోనే కొనసాగవచ్చన్నది కొంతమంది బ్యాంకర్ల ఆలోచన.
మూడేళ్లకైతే ఓకే
ఈ రుణాల పేరులో మాత్రమే ఫిక్స్‌డ్ కనిపిస్తుంది కాని ఇవి నిజంగా ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు కావు. కేవలం స్వల్పకాలానికి మాత్రమే వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. ఆ తర్వాత ఇవి ఫ్లోటింగ్ రేటులోకి మారిపోతాయి. వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి పూర్తి కాలానికి ఫిక్స్‌డ్ రేటును అందించడానికి బ్యాంకులు వెనకాడుతున్నాయి. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్పకాలానికి ఒకటి రెండు సంవత్సరాలకే ఫిక్స్‌డ్ రేట్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ మూడు, ఐదేళ్లకు అందిస్తుంటే, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఐదేళ్లకు ఫిక్స్‌డ్ రేట్లను అందిస్తోంది.
వచ్చే ఐదేళ్లు వడ్డీరేట్లు ఇంత గరిష్టస్థాయిలో నిలదొక్కుకోవడం కష్టమని, ప్రస్తుత స్థాయి నుంచి ఐదేళ్లలో తప్పకుండా తగ్గే అవకాశాలున్నందున ఫిక్స్‌డ్ వడ్డీరేట్ల కంటే ఫ్లోటింగ్ రేట్లలోనే రుణాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అనిల్ రెగో అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్లు తక్షణం దిగొచ్చే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి కాబట్టి చక్కటి ప్లానింగ్ చేసుకోవాలనుకునే వారు గరిష్టంగా మూడేళ్ల వరకు ఫిక్స్‌డ్ రేట్లలో రుణాలు తీసుకోవచ్చని కిషోర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ల స్థాయిలోనే ఫిక్స్‌డ్ రేట్లు అందిస్తున్నందున స్వల్పకాలానికి ఫిక్స్‌డ్ రేట్లు తీసుకోవచ్చంటున్నారు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఫ్లోటింగ్ రేటు 10.65 శాతంగా ఉంటే ఫిక్స్‌డ్ రేటు 11.15 శాతంగా ఉంది. ఇలా ఈ రేటు ఐదేళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఫ్లోటింగ్ రేటులోనే రుణాలు తీసుకోవడం ఉత్తమం అన్నది నిపుణుల మాట.
ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అంటే..
వివిధ బ్యాంకులు, మార్టిగేజ్ సంస్థలు గృహరుణాలను ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ వడ్డీరేట్లలో అందిస్తుంటాయి. ఫిక్స్‌డ్ రేటు విధానం ఎంచుకుంటే రుణం తీసుకున్న తర్వాత వడ్డీరేట్లు పెరిగినా, తగ్గినా సంబంధం లేకుండా మీరు రుణం తీసుకున్నప్పుడు ఉన్న రేట్లే కొనసాగుతాయి.
అదే ఫ్లోటింగ్(చలన) రేటు ఎంచుకుంటే బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీరేట్లు మార్చినప్పుడల్లా మీరు చెల్లించే రేట్లు కూడా మారతాయి. గృహ రుణాలు తీసుకుంటున్న వారిలో 90 శాతం మందికి పైగా ఫ్లోటింగ్ రేటునే ఎంచుకుంటున్నట్లు అంచనా.
ఐసీఐసీఐ బ్యాంక్
గత రెండేళ్లుగా గృహ రుణాల వ్యాపారంలో అంత చురుగ్గా పాల్గొనని ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ రేట్లతో పథకాలను ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలపరిమితితో కూడిన రెండు రకాల ఫిక్స్‌డ్ రేట్లను ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు వడ్డీరేట్లు మారకుండా ఉండే పథకంలో రూ. 25 లక్షల లోపు రుణంపై 10.5%, రూ.25-75 లక్షలలోపు 11%, అంతకంటే ఎక్కువ విలువైన రుణాలపై 11.50% వడ్డీని ఆఫర్ చేస్తోంది. అదే రెండు సంవత్సరాలు ఫిక్స్‌డ్ రేటును ఎంచుకుంటే పై రేట్లకు పావు శాతం అదనంగా చెల్లించాలి.
హెచ్‌డీఎఫ్‌సీ
దేశీయ అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ మూడు, ఐదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ రేట్లపై గృహ రుణాలను అందిస్తోంది. మూడేళ్ల ఫిక్స్‌డ్ కాలానికి రూ.30 లక్షల లోపు రుణానికి 10.75 శాతం, రూ.30-75లక్షల లోపు రుణ మొత్తానికి 11.25 శాతం వడ్డీని వసూలు చేస్తుంటే ఐదేళ్ల కాలానికి వేర్వేరు మొత్తాలకు 11.25%, 11.50%గా ఉన్నాయి. రూ.75 లక్షలు దాటిన రుణానికి రెండింటిలో 11.75 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ కూడా ఐదేళ్ల కాలపరిమితికి ‘న్యూ అడ్వాంటేజ్-5’ పేరుతో ఫిక్స్‌డ్ వడ్డీరేట్లను ప్రకటించింది. రూ.30 లక్షలలోపు రుణానికి ఐదేళ్లపాటు 11.15%, రూ.30-75లక్షల వరకు 11.40%, రూ.75లక్షలు-1.50 కోట్ల వరకు 11.65 శాతం వడ్డీని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలులో ఉండే ఈ రుణ పథకం కింద మొదటి విడత రుణ పంపిణీ 2012 జనవరి 15 లోగా తీసుకోవల్సి ఉంటుందని నిబంధన విధించింది.
- ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం
//Coutesy: Sakshi
| Reactions: |
Subscribe to:
Posts (Atom)
పట్టాభిషిక్తురాలై అరవై ఏళ్లు
క్వీన్ ఎలిజబెత్-ఐఐ ప్రొఫైల్
ఆధునిక రాణి
775 గదుల రాజమహల్
తర్వాతి చక్రవర్తి ఎవరు?